స్టేజ్ పైనే అషు రెడ్డిని బొచ్చు.. అంటూ అవమానించిన కమెడియన్ హరి..!

0
343

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ని స్టార్ మాలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న “కామెడీ స్టార్స్”ఈ కార్యక్రమం కూడా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా పలువురు కమెడియన్స్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ క్రమంలో భాగంగా యాంకర్ గా శ్రీముఖి ఎంటరయ్యారు. ఇదివరకు ఈ కార్యక్రమానికి యాంకర్ గా వర్షిణి వ్యవహరించేవారు. కొన్ని కారణాల వల్ల వర్షిణి తప్పుకోవడంతో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటిమాదిరిగానే ఈ కార్యక్రమంలో కమెడియన్స్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు.అలాగే శేఖర్ మాస్టర్ కూడా స్టేజ్ పై డాన్స్ ఫర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో కమెడియన్ హరి స్కిట్ లో భాగంగా
అషు రెడ్డి చేపలు అమ్ముతూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే హరి ఆమెతో మాట్లాడుతూ నీ పేరేంటి అని అడగగా.. అందుకు అషు రెడ్డి నాపేరు శీలవతి అంటూ సమాధానం చెబుతుంది. శీలవతా.. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావని హరి అడగగా.. అందుకు అషు ఆ.. మా అమ్మకు శీలవతి చేప అంటే గొప్ప ఇష్టం అందుకే నాకాపేరెట్టింది అని సమాధానం చెబుతుంది.

అషు రెడ్డి చెప్పిన సమాధానం విన్న హరి అవునా… ఇంకా నయం మీ అమ్మకు బొచ్చు అంటే ఇష్టం లేదు అంటూ అషు రెడ్డికి కౌంటర్ ఇచ్చాడు. ఈ విధంగా హరి
అషు రెడ్డి పై కౌంటర్ వేయడంతో అక్కడున్న వారందరూ ఎంతో నవ్వుకున్నారు.ఇంకా అదే విధంగా స్టేజిపైకి వెంకన్న ఓహో జాంబియా అంటూ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కార్యక్రమంలో మరింత సందడి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here