Coramandal train tragedy : కొరమండల్ రైలు ప్రమాదంలో ఆడియో లీక్ కలకలం… నివేదికలో లోపాలు అంటూ…!

0
179

Coramandal train tragedy : ఒక చిన్న పొరపాటు కొన్ని వందల మంది ప్రాణాలను గాల్లో కలిసేలా చేసింది. సిగ్నలింగ్ ఇచ్చే సిబ్బంది అలసత్వమే కోరమండల్ రైలు ప్రమాదానికి కారణం అయింది. ఇప్పటికే 288 మంది చనిపోగా 1178 మంది గాయాలపాలైన ఈ ఘటనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకోవటం వల్ల రైలు లూప్ లైన్ లోకి వెళ్లి ముందున్న గూడ్స్ బండిని ఢీకొట్టింది. ముందున్న రెండు భోగిలు ఎగిరి పక్కనున్న ట్రాక్ మీద పడగా అటుగా వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఢీ కొట్టడంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పింది. ఇలా మానవ తప్పిందం వల్ల కొన్ని వందల కుటుంబాల్లో విషాదం మిగలగా ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం సిబిఐ విచారణకు అదేశించిన సంగతి తెలిసిందే.

నివేదికలో పొరపాట్లు…

30 ఏళ్లలో ఎపుడూ జరగంత పెద్ధ ట్రైన్ ఆక్సిడెంట్, అది కూడా మానవ తప్పిద్ధం వల్ల జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలను చూపుతోండగా అశోక్ అగర్వాల్ నివేదిక మీద అనుమానలు మొదలయ్యాయి. కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగిన వెంటనే అందరూ లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని భావించినా అతని తప్పు లేదని సిగ్నలింగ్ లోపం వల్లే ఘటన జరిగిందని ప్రభుత్వ విచారణలో తెలిపింది.

అయితే అశోక్ అగర్వాల్ రైలు దుర్ఘటన మీద ఇచ్చిన రిపోర్ట్ అక్కడ జరిగిన ఆక్సిడెంట్ కి పొంతన లేకుండా ఉందని నివేదికలో లోపాలు ఉన్నాయంటూ ఇద్దరు రైల్వే అధికారులు ఫోనులో సంభాషించిన ఆడియో నెట్టింట్లో లీక్ అయి కలకలం రేపింది. ఘటన పై పలు అనుమానలను రేకెత్తిచ్చింది. ఆదివారం సాయంత్రం ట్రైన్ లోకో పైలట్ చికిత్స తీసుకుంటూ మృతి చెందగా మరో లోకో పైలట్ ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారు. గూడ్స్ ట్రైన్ గార్డ్ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్స్ క్షేమంగా బయటపడ్డారు.