తెలంగాణాలో 809 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య… ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ లో 31 కేసులు !!

0
300

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నా కూడా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కష్టతరమవుతుంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. తెలంగాణ మొత్తం మీద ఈ ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. కరోనా నుండి బయటపడి ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 606 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. హైదరాబాద్ లో 31, గద్వాల్ 7, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండలో కొత్తగా 1 కేసు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు ఎవరు డిశ్చార్ కాలేదు.. కొత్తగా మరణాలు కూడా సంభవించలేదు.

ఈ క్రమంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉందని, అందువల్ల అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. మరోవైపు హైదరాబాద్ లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రజలు ఎవరు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు సీఎం కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here