వామ్మో.. వాటి ద్వారా కూడా కరోనా సోకుతుందట.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

0
242

కరోనా వైరస్ గత సంవత్సరం నుంచి ప్రజలను ఎంత ఇబ్బందులకు గురిచేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాను రాను వైరస్ యొక్క లక్షణాలు కూడా మారుతూ వచ్చాయి. అయితే తాజాగా కరోనా సోకిన వ్యక్తి కన్నీళ్ల ద్వారా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల కంటి వైద్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచించారు.

కరోనా సోకిన వ్యక్తి కళ్లల్లో చూసినా కరోనా సోకే ప్రమాదం ఉంది. తజాగా కన్నీటి ద్వారా కరోనా సోకుతుందని.. అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహించిన తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. ఈ అధ్యయనం కోసం, రోగి ఆర్టీపీసీఆర్ (RT-PCR)నివేదిక అందిన 48 గంటలలోపు కన్నీటి నమూనాలను తీసుకున్నారు.

ఈ నమూనాలో కన్నీటి ద్వారా కూడా కరోనా వస్తుందని వెల్లడించారు. దీని కోసం అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల 120 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనం చేశారు. 60 మంది రోగులలో కన్నీళ్ల ద్వారా వైరస్ శరీరంలోని మరొక భాగానికి చేరిందని నివేదికలో వెల్లడైంది. 60 మందికి రోగుల్లో ఇది జరగలేదు.

ఈ పరిశోధనకు ఎంచుకున్న రోగుల్లో 41 మందికి కండ్లకలక, 38 మందిలో ఫోలిక్యులర్ రియాక్షన్స్, 35 లో కెమోసిస్, 20 మంది రోగులలో మ్యూకోయిడ్ డిశ్చార్జ్, ఎచింగ్ చేయడంలో ఇబ్బంది ఉంది. అందువల్ల కంటి సంబంధిత వైద్యులు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.