ముంబై సముద్ర తీరంలోని క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీ లో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు తనని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం తండ్రి షారుఖ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆర్యన్ బెయిల్ కోసం షారుఖాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి కోర్టు నుంచి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. ఈ క్రమంలోనే తన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ చేయగా.. ఎన్సీబీ అధికారులు మాత్రం విచారణ కోసం తనకి మరికొన్ని రోజులు రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరడంతో అందుకు కోర్టు అతనికి మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఆర్యన్ తో పాటు అరెస్టయిన మరో ఎనిమిది మందికి కూడా 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్టులో వాదోపవాదనలు జరగగా తనకు ఆ షిప్ లో జరుగుతున్నటువంటి పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని.. తనకు బెయిల్ మంజూరు చేసిన విచారణకు తన పూర్తి సహకారం ఉంటుందని ఆర్యన్ తెలియ చేసినప్పటికీ కోర్టు మాత్రం అతని బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
ఈ విధంగా కోర్ట్ ఆర్యన్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం తో షారుక్ ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతను బెయిల్ కోసం షారుక్ ఖాన్ పై కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే షారుక్ తనయుడు డ్రగ్ కేసులో భాగంగా ఆర్యన్ కు మద్దతుగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఎన్నో వివాదాలు విమర్శలకు కారణమవుతోంది.
































