CPI Narayana: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నటువంటి నాగార్జున ఒకవైపు వెండితెర సినిమాలలో మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పలు యాడ్స్ ద్వారా కూడా నాగార్జున ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్ రియాలిటీ షో కి నాగార్జున మూడవ సీజన్ నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక గత సీజన్లో నాగార్జున కంటెస్టెంట్ ల పట్ల చూపించే వ్యత్యాసం వల్ల చాలామంది ఈయనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక హోస్ట్ గా తప్పు ఒప్పు తెలియకుండా మాట్లాడటమే కాకుండా ఒకరి వైపే మాట్లాడటంతో చాలామంది నాగార్జున వ్యవహార శైలి పై మండిపడ్డారు. ఇలా నాగార్జున పై విమర్శలు చేసిన వారిలో సీపీఐ నారాయణ ఒకరు.గతంలో బిగ్ బాస్ వ్యాఖ్యాతక వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పట్ల విమర్శలు చేసిన ఈయన తాజాగా మరోసారి నాగార్జున పై మండిపడ్డారు.

తాను బిగ్ బాస్ కార్యక్రమం పట్ల చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని,నేను మహిళలను కించపరిచారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదంటూ ఈయన తెలియచేయడమే కాకుండా కళాకారులను నేను ఎప్పుడు గౌరవిస్తాను ఇలా నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి తరం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana: నన్ను బ్లాక్ మెయిల్ చేయడం సరికాదు…
ఇక సినిమా రంగం అంటే కేవలం నాగార్జున మాత్రమే కాదు,చిరంజీవి వంటి ఎంతో గొప్ప గొప్ప హీరోలు కూడా ఉన్నారని ఆయన చిరంజీవికి నాగార్జునకు ఏ మాత్రం పోలిక లేదని వీరిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. నాగార్జున డబ్బు కోసం బిగ్ బాస్ వంటి కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. కానీ చిరంజీవి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా ప్రస్తుతం యాడ్స్ లో నటించడానికి చాలా దూరంగా ఉన్నారంటూ ఈయన వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో వేచి ఉండాలి.































