సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా ముందుకు వచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బుద్ధి తక్కువై జనసేనతో కలిసి పోటీ చేశామని వ్యాఖ్యలు చేశారు. జగన్, చంద్రబాబు, పవన్ పనితీరు వల్ల ఏపీ తీవ్రస్థాయిలో నష్టపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు.

పవన్ మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేశారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ పార్టీ వైఖరి అమరావతి విషయంలో ఎప్పటికీ మారదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, జగన్ కూడా మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ బిల్లులకు టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు ఇచ్చాయని.. రైతులకు తీవ్రస్థాయిలో నష్టం కలిగించే బిల్లులకు ఆ పార్టీలు మద్దతు ఇవ్వడం సరికాదని చెప్పారు.
అధికారంలోకి రాక ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తరువాత 22 మంది ఎంపీలు విజయం సాధించినా జగన్ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని అన్నారు. వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
భవిష్యత్తులో జగన్ కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని అన్నారు. నారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పవన్ పై నారాయణ వ్యక్తిగత విమర్శలు చేయడం గురించి ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

































