బ్యూటీ క్వీన్ సమంత సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకొని విశేషమైన ప్రేక్షకాభిమానాన్ని పొందుతోంది. సమంత తన కెరీర్లో మొదటి సారి పౌరాణిక పాత్రల్లో నటిస్తున్న చిత్రం “శాకుంతలం” ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ పాన్ ఇండియ మూవీగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమగాథ ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తోంది.దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా ఉధృతి తగ్గడంతో ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రధాన పాత్రలకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్స్‌లో ఇటీవలే షూటింగ్ ప్రారంభమైందనీ చిత్ర నిర్మాతలు దిల్ రాజు, నీలిమా గుణ ప్రకటించారు.
నిర్మాతలు చేసిన ప్రకటనపై అభిమానులు స్పందిస్తూ శాకుంతలం సినిమాలో సమంత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని నిర్మాతలకు రిక్వెస్ట్ పెడుతున్నారు. దీనిపై నిర్మాత నీలిమా గుణ స్పందించారు.ఇప్పుడే రెండో షెడ్యూల్ ప్రారంభించామని, ఫస్ట్‌లుక్ కోసం కొంత సమయం పడుతుందని ట్వీట్ చేశారు.తొలిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోన్న సమంత ఏ మేరకు ప్రేక్షకులను ఆకర్షిస్తుందో వేచి చూడాలి మరి.































