వర్షాకాలంలో పెద్ద పెద్ద గుంటలు ఉంటే అందులో నీళ్లు చేరడం సహజం. అయితే ఆ నిళ్లు నిశ్చల స్థితిలో ఉంటాయి.. ఒకవేళ ఆ నీళ్లు అటూ.. ఇటూ కదులుతున్నట్లు అనిపిస్తే మాత్రం అందులో ఏదో ఒకటి ఉన్నట్లు మనకు అనిపిస్తుంటుంది. అయితే ఇలానే ఓ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్డంతా చెరువుని తలపించింది.

ఆ నీళ్లను దాటి అవతలి వెళ్లాల్సి రాగా.. అందులో ఏదో పెద్ద ఆకారం కదులుతున్నట్లు కనిపించింది అక్కడ ఉన్నవాళ్లకు . అయితే కొద్దిసేపు వాల్లు భయపడిపోయారు. తర్వాత అస్సలు అక్కడ ఏముందో తెలసుకుందాం అనుకున్నారు.. అక్కడకు వెళ్లి క్షణ్ణంగా పరిశీలించగా.. అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో నుంచి ఓ పెద్ద మొసలి బయటకొచ్చింది.
ఈ ఘటన గుజరాత్‌లోని వదోదరాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దానిని చూసిన ఆ కాలనీ వాసులు తెగ భయపడిపోయారు. దానిని అక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.
ఆ మొసలిని కర్రతో బెదిరిస్తూ.. వలకు చిక్కేలా చేశారు. అయితే ఈ వీడియోను అక్కడే ఉన్న కాలనీ వాసి తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. వీడియోను పోస్టు చేసిన గంట్లోనే ఆ వీడియోకు కొన్ని వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నిడివి కేవలం 48 సెకన్లు మాత్రమే ఉంది. ఇక కామెంట్లలో ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.






























