Harsha Bhogle: ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే కిడ్నాప్ కు గురయ్యారంటూ గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ చానెల్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న హర్ష చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి ఎంఎస్ ధోని తప్పుకోవడంపై ఇన్‌స్టా లైవ్‌లో ఉన్నఫలంగా కనిపించకుండా పోయారు.

ఇలా ఈయన స్క్రీన్ పై కనిపించకపోవడమే కాకుండా “క్యా హువా? కౌన్ హై? కహా సే ఆ గయే?” అని హర్షా భోగ్లే అని గట్టిగా అరవడంతో ఎవరో అతనిపై దాడి చేస్తున్నారని లేదా అతను కిడ్నాప్ గురయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలేం జరిగింది?అతనిని ఎవరు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

Not confirmed! @bhogleharsha potentially kidnapped.
— Darshana K (@_TheKande) March 24, 2022
Source: from telegram pic.twitter.com/IkCWikEod4
ఇక ఈ విషయం గురించి క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరుగుతుందో మాకు కూడా తెలియదు. అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం హర్షా భోగ్లే టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం’అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా ట్వీట్ చేయడంతో ఈ విషయం పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే చివరికి తెలిసిన విషయం ఏమిటంటే హర్ష భోగ్లే పై నిజంగానే దాడి జరగలేదని కేవలం ఈ కార్యక్రమం పై మరింత హైప్ తీసుకురావడం కోసమే ఇలా నాటకం ఆడారని తెలుస్తోంది.
I am fine. Sorry to have got a lot of you worried. Thank you for the love and concern. It became more viral than I anticipated. That too is a learning. It was meant to lead to something else. Sorry. And cheers.
— Harsha Bhogle (@bhogleharsha) March 24, 2022
ఉద్దేశ పూర్వకంగా చేయలేదు…
ఇక అసలు విషయం తెలియడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్ష భోగ్లే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…ముందుగా అందరికీ క్షమాపణలు తెలియజేస్తూ ఎవరు ఆందోళన చెందకండి నేను క్షేమంగానే ఉన్నాను. నాపై ఎలాంటి దాడి జరగలేదు వీడియోలో భాగంగా ఇలా చేసాము. అయితే నేను చేసినది తప్పు అని తెలుసుకున్నాను. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు తెలియజేశారు.
You learn something new everyday. It seemed a lighthearted thing to do but in its execution, it became something that I didn't think it would. I am actually a bit embarrassed now. https://t.co/OwFrwb6vm9
— Harsha Bhogle (@bhogleharsha) March 24, 2022































