కోట్లకు పడగలెత్తిన సంపన్నులు ఆ డబ్బులు సంపాదించడం కంటే వాటిని ఖర్చు చేయడంలో కూడా తన మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఓ వ్యక్తి చేసిన సహాయం, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ కోటి రూపాయలు పరిహారం చెల్లించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకి చెందిన కృష్ణన్(45) యూఏఈలో ఉద్యోగం చేసేవారు. తొమ్మిదేళ్ల కిందట 2012లో కారు యాక్సిడెంట్ చేయడంతో సూడాన్‌కి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు.దీంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే కారు ప్రమాదం చోటుచేసుకుని బాలుడు మృతి చెందాడని సాక్షాలు ఉండడంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని భావించిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది.
న్యాయస్థానం విధించిన మరణశిక్ష నుంచి కృష్ణన్ కాపాడటం కోసం తమ కుటుంబం అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా క్షమాభిక్ష కోరుతూ బాలుడు కుటుంబాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బాలుడి కుటుంబం సూడాన్ వెళ్లిపోవడంతో క్షమాభిక్ష ప్రయత్నాలు నెరవేరలేదు. చివరికి లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిసి విషయం విన్నవించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తనకు అందజేయాల్సిందిగా యూసఫ్ తెలిపారు.
కేసు వివరాలన్నింటినీ పరిశీలించిన యూసుఫ్ ఈ ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా కాదని,కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని భావించి ఎలాగైనా తనని మరణ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని భావించాడు. అప్పటినుంచి అతను ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అదే విధంగా సూడాన్ లో ఉన్నటువంటి బాలుడు కుటుంబాన్ని అబుదాబి రప్పించారు. పలు దఫాలు వారితో చర్చించి వారిని క్షమాభిక్షకు ఒప్పించారు.ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కోర్టుకు కోటి రూపాయలను పరిహారం చెల్లించి అతనికి మరణశిక్ష నుంచి విముక్తి కల్పించారు.ఈ విధంగా చేయని తప్పుకు శిక్ష పడే కాపాడటమే కాకుండా కుటుంబానికి మొత్తం సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.





























