మనలో చాలామందికి ప్రతిరోజూ ఏదో ఒక ఆఫర్ పేరిట ఫోన్లు వస్తుంటాయి. మరి కొంతమందికి ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులు సెకండ్ హ్యాండ్ లో తక్కువ ధరకే దర్శనమిస్తూ ఉంటాయి. ఆలస్యం చేస్తే ఆఫర్ అందుబాటులో ఉండదని భావించి మనలో చాలామంది వెంటనే వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించి మోసపోతూ ఉంటారు.ఒకవేళ మోసపోయినాఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉంటారు.

తాజాగా లా వేల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓఎల్‌ఎక్స్‌ అమ్మకాల పేరుతో గత కొన్ని నెలల నుంచి భరత్‌పూర్‌ గ్యాంగ్‌ చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు. ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్ పేర్లతో మోసాలు చేసిన నిందితుల ఇళ్లలో 800 సిమ్ కార్డులు లభ్యమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను చూసి సైబర్ క్రైం పోలీసులు అవాక్కయ్యారు.

మోసగాళ్లు తమ చేతిలో ఎవరైనా మోసపోతే వాళ్ల నుంచి ఇబ్బందులు రాకుండా వెంటనే సిమ్ కార్డును మార్చి మరొక కొత్త మోసానికి తెర లేపుతున్నారు. ప్రజలు దేశంలో రోజురోజుకు మోసాలు చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుడ్డిగా నమ్మి మోసపోతే తర్వాత బాధ పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. యువత, విద్యార్థులు ఎక్కువగా ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు.

కొందరు మోసగాళ్ల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here