ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పుష్ప మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాట్లాడుతున్నారు. కలెక్షన్లలో ఈ సినిమా గత రికార్డులను చెరిపేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల అవుతుందని తెలిసి కూడా నానీ నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్ చిత్ర సభ్యులు ధైర్యంగా ఈ శుక్రవారం సినిమాను విడుదల చేస్తున్నారు.

కథపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను తీశామని.. సినిమా అద్బుతంగా వచ్చిందని.. చెబుతూ.. ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిజీగా ఉన్న ఈ బృందం.. నానీ కూడా వాళ్లతో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా నానీ తన కొడుకు అర్జున్‌తో కలిసి తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!
శ్యామ్ సింఘరాయ్’ స్టార్ షేర్ చేసిన వీడియోలో అర్జున్ తన తండ్రితో మీసంతో నువ్వు సింహంలా కనిపిస్తున్నావు నాన్న అని అర్జున్ చెప్పడం కనిపించింది. అర్జున్ తన తండ్రి మీసాలు తిప్పుతూ నాని రాబోయే చిత్రం ‘శ్యామ్ సింఘా రాయ్’ టైటిల్ ట్రాక్‌ని కూడా జపిస్తాడు. ఈ వీడియోను నాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

నాని ‘శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న విడుదల కానుంది. ప్రస్తుతం నానీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండగా.. అతను ఈ సినిమాలో డ్యూయల్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. వెస్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటించింది. మరోవైపు, నాని సరసన కృతి శెట్టి యూత్‌ఫుల్ రోల్‌లో కనిపించనుండగా, ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.
Lion la vunnavu Nanna ????#ShyamSinghaRoy pic.twitter.com/OwKZFzJXcL
— Nani (@NameisNani) December 20, 2021































