దేశంలో టెక్నాలజీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు సేవలను సులభతరం చేస్తున్నాయి. గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు సులువుగా లావాదేవీలు జరపడం సాధ్యమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఖాతాలో నగదు ఉన్నా డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో సైతం నగదు విత్ డ్రా చేసుకునే విధంగా బ్యాంకులు సరికొత్త టెక్నాలజీతో ఏటీఎం సేవలను మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. సాధారణంగా డెబిట్ కార్డును ఉంచి ఏటీఎం పిన్ ను ఎంటర్ చేయడం ద్వారా నగదు విత్ డ్రా చేయడం సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు మొబైల్ ఫోన్ సాయంతో ఏటీఎం పిన్ ఎంటర్ చేసి నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
అయితే వినియోగదారులకు మరో కొత్త రకం ఏటీఎం సర్వీసులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సర్వీసుల ద్వారా సులువుగా ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం డీసీబీ బ్యాంక్ ఖాతాదారులకు ఓటీపీ కూడా అవసరం లేకుండా నగదు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆధార్ ఆధారిత అథంటికేషన్ సౌకర్యం డీసీబీ బ్యాంకులలో అందుబాటులో ఉంటుంది.
అయితే ఫింగర్ ప్రింట్ సహాయంతో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని భావించే వాళ్లు ఖచ్చితంగా వారి ఆధార్ నంబర్ ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయించుకోవాలి. బ్యాంకులు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తుండటంతో ఆ సర్వీసుల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతోంది.































