బాలీవుడ్‌లో హాట్ కపుల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ఇద్దరూ స్టార్సే. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. మరి దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ లలో ఎవరు బాగా రిచ్? ఇద్దరి ఆస్తులెలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటగా పేరు తెచ్చుకున్న వారిలో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి.. 2011లో మొదలైన వీరి ప్రేమ కథ 2018లో ఇటలీలో అత్యంత వైభవంగా జరిగిన వివాహంతో ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఒక్కసారి చూడగానే కూల్ కపుల్స్ అనిపించే ఈ జంట తన కుటుంబ జీవనాన్ని ఎంతో ప్రైవేట్‌గా ఉంచినా, వీరి కెరీర్ మరియు ఆస్తుల గురించి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొని ఉంటుంది. తాజాగా రణ్‌వీర్ సింగ్ తన పుట్టినరోజు (జూలై 6) సందర్భంగా తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వార్తలు వచ్చాయి. బాలిక జన్మించిందన్న వార్తలతో ఈ స్టార్ జంట అభిమానుల్లో ఆనందం నింపింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాలతో పాటు కుటుంబ జీవితంలోనూ పూర్తి స్థాయిలో మునిగిపోయారు.
ఆర్థికంగా చూస్తే ఈ జంట ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న జంటలలో ఒకటి. రణ్‌వీర్ సింగ్ మొత్తం ఆస్తులు సుమారు రూ.362 కోట్లు. ఆయన ఒక్కో సినిమాకు సుమారుగా రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. 2019లో ఆయన వార్షిక ఆదాయం రూ.21 కోట్లు కాగా, ప్రస్తుతం అది మరింత పెరిగింది. గూచి, లూయిస్ విటన్, అడిడాస్, నెక్సా లాంటి పలు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అదనంగా కోట్లల్లో సంపాదిస్తున్నాడు. ఇక దీపికా పదుకొణె విషయానికి వస్తే, ఆమె సంపద రణ్‌వీర్ కంటే ఎక్కువే. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగా ఉందని సమాచారం. సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ నటిస్తూ తన మార్కెట్‌ను నిలబెట్టుకుంది. అంతేకాకుండా ఆమె కూడా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆమెకు ఉన్న సక్సెస్ రేట్, ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా ఆమె బ్రాండ్ విలువను మరింత పెంచింది.
ఇద్దరిదీ కలిపి చూసుకుంటే సుమారు రూ.860 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఈ జంట నిజంగా అద్భుతమైన స్టేటస్‌ని సాధించిందని చెప్పాలి. ప్రస్తుతం రణ్‌వీర్ ‘డాన్ 3’ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అంతకుముందు ‘దురంధర్’ అనే మరో సినిమా విడుదల కావచ్చు. అదే సమయంలో దీపికా పదుకొణె సౌత్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ భారీ తెలుగు ప్రాజెక్ట్‌లో నటించనుంది. వీరిద్దరూ వ్యక్తిగత జీవితాన్ని సంతృప్తిగా గడుపుతూనే, సినిమాలతో ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ తాము ఎలాంటి వెనుకంజ వేయలేదని నిరూపిస్తున్నారు.





























