Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో అక్రతారగా కొనసాగుతున్న దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి ఇండస్ట్రీలో ఆగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. ఇలా అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దీపిక తాజాగా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కావడంతో తమిళనాడులో జరుగుతున్నటువంటి ఓ కార్యక్రమంలో ఈమె హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ఈమె ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం ముఖ్యం కాదని మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.
మానసికంగా మనం దృఢంగా ఉన్నప్పుడే దేనినైనా సాధించగలమని,అయితే ఇలాంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నప్పుడు తప్పనిసరిగా కుటుంబం మన తోడు ఉండాలంటూ ఈ సందర్భంగా ఈమె తనకు జరిగినటువంటి ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.ఇండస్ట్రీలో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో తాను ఎంతో డిప్రెషన్ కి గురయ్యానని ఈ సందర్భంగా దీపికా పదుకొనే తెలియజేశారు.

Deepika Padukone: అమ్మ నాలో ఎంతో ధైర్యాన్ని నింపింది..
తాను సినిమా పనుల నిమిత్తం ముంబైలో ఉండగా అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు తనని చూడటం కోసం ముంబై వచ్చేవారని అయితే వారు వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నట్టు నటించేదాన్ని అని దీపిక తెలిపారు. అయితే నన్ను గమనించిన మా అమ్మ తనని నిలదీసిందని, అమ్మ అలా అడిగేసరికి తన బాధ మొత్తం బయట పెట్టానని తెలిపారు. ఇలా అమ్మతో తన బాధను పంచుకున్న తర్వాత అమ్మ తనకు తోడుగా ఉండి తనకు ఎంతో ధైర్యాన్ని నింపింది. నిజంగా ఆ రోజు అమ్మను దేవుడే తన దగ్గరకు పంపారని,ఆరోజు అమ్మ ఈ విషయం అడగకపోయి ఉంటే ఈరోజు నేను ఎలా ఉండేదానో అంటూ తన జీవితంలో జరిగిన సంఘటన గురించి ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























