2016 సంవత్సరంలో వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు సుపరిచయమయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ తరువాత దీప్తి సునైనాతో చేసిన కవర్ డ్యాన్సులు ఇటు షణ్ముఖ్ కు, అటు దీప్తి సునైనాకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. యూట్యూబ్ లో ఈ జోడీ పదుల సంఖ్యలో కవర్ సాంగ్స్ చేయగా ఆ సాంగ్స్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య ఏదో ఉందని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి.

వాళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొనడం వల్ల షణ్ముఖ్, దీప్తి సునైనాకు మధ్య విభేదాలు వచ్చాయని ఆ తరువాత అందుకే వీళ్లిద్దరూ కలిసి వీడియోలు చేయలేదని గాసిప్స్ వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ షోలో దీప్తి సునైనా తనీష్ తో కొంత సన్నిహితంగా మెలగడం వల్లే గొడవలు జరిగాయని ప్రచారం జరిగింది.

ప్రస్తుతం షణ్ముక్ వేరే వాళ్లతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో హిట్లను సాధించింది. అయితే దీప్తి సునైనాకు దూరంగా ఉన్నా ఆమెపై షణ్ముఖ్ కు ప్రేమ ఇప్పటికీ ఉందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం క్యాష్ ప్రోగ్రామ్ కు హాజరైన షణ్ముఖ్ ఆ ప్రోగ్రామ్ లో తనకు వైష్ణవి చైతన్య కంటే దీప్తి సునైనానే ఇష్టమని షణ్ముఖ్ చెప్పారు.

తాజాగా షణ్ముఖ్ లైవ్ ఇంటరాక్షన్ లో అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు దీప్తి సునైనాతో లవ్ గురించి షణ్ముఖ్ ను అడిగారు. షణ్ముఖ్ సమాధానమిస్తూ తన చేతిపై టాటూ అలాగే ఉందని.. ఆ టాటూ ఉన్నంత వరకు దీప్తిపై ప్రేమ అలాగే ఉంటుందని అన్నారు. షణ్ముఖ్ దీప్తి విషయంలో కూల్ గా ఉండటంతో త్వరలో వీళ్లిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here