బిగ్ బాస్ హౌస్ లో గత శనివారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు సర్ ప్రైజ్ చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ షణ్ముఖ్ కోసం తన అన్నయ్య దీప్తి సునయన వేదిక పైకి వచ్చారు. ఇలా దీప్తి సునయన వేదికపైకి వచ్చి షణ్ముక్ కి మరింత ధైర్యం చెప్పిందని తప్పకుండా నువ్వే గెలవాలి అంటూ అతనిని ఎంకరేజ్ చేసింది.

ఇక దీప్తి సునయన మాట్లాడుతూ మరో మూడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండమని చెబుతూ అతని పై ముద్దుల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ విషయంలో దీప్తి సునైనా కంటెస్టెంట్ షణ్ముఖ్ కి ఒక హింట్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

దీప్తి సునైనా వేదికపైకి రాగానే తన రెండు వేళ్ళతో మైక్ పట్టుకోవడం చూస్తుంటే తను ఇండైరెక్టుగా షణ్మఖ్ కి తను టాప్ టు లో ఉన్నట్లు చెప్పిందని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షణ్ముఖ్ కూడా దీప్తి సునైనా వైపు చూసి చూడనట్లు ఉన్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరగడంతో ఈ విషయంపై దీప్తి సునైనా స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీబొందరా..మీ బొంద నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర పనులు చేయను. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా దృష్టిలో షణ్ముఖ్ ఎప్పుడు విన్నర్ అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం దీప్తి సునయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































