Delhi Horror: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం కానుకగా జరిగినటువంటి ఒక భయానక ఘటన గురించి తరచు వార్తలు వస్తున్నాయి.అంజలి అనే యువతిని దుండగులు కారుతో గుద్ది 13 కిలోమీటర్ల పాటు తనని ఈడ్చుకెళ్ళిన ఘటన అందరిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.అయితే తాజాగా ఈ ఘటన గురించి అంజలి స్నేహితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నూతన సంవత్సరం కానుకగా ఒక పార్టీలో ఈవెంట్ జరుపుకున్న అనంతరం అంజలితో పాటు తన స్నేహితురాలు నిధి కూడా తనతో పాటే ఉన్నారు.ఇదివరకు అంజలి ఒక్కతే స్కూటీలో ప్రయాణిస్తుందని తెలుస్తుంది. కానీ హోటల్ ముందు సీసీటీవీ ఫుటేజ్ కనుక చూస్తే అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా స్కూటీలో ప్రయాణిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు డ్రైవింగ్ చేసే విషయంలో గొడవ పడ్డాము అయితే కాసేపు నేను డ్రైవింగ్ చేయగా అప్పుడే అంజలి డ్రైవింగ్ చేస్తూ ఉందని తాను వెనక కూర్చున్నానని నిధి తెలిపారు. అయితే ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి చాలా రాష్ డ్రైవింగ్ చేస్తూ తమ స్కూటీని ఢీ కొట్టారని ఇలా ఢీకొట్టగానే తాను పక్కకు వెళ్లి పడిపోయాను కానీ అంజలి మాత్రం కారు టైర్లలో ఇరుకుంది.
ఇలా ఆమెను గమనించని దుండగలు వీధుల గుండా సుమారు 13 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లారని నిధి తెలిపారు.ఈ ప్రమాదంలో నేను పక్కకు వెళ్లి పడటంతో తనకు ఎలాంటి గాయాలు తగలలేదని అయితే అక్కడి నుంచి భయంతో పారిపోయి ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేకపోయానని నిధి తెలిపారు.అయితే పోలీసుల ముందు కోర్టులో తను వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు పలు సెక్షన్ల పై కేసు నమోదు చేశారు.

Delhi Horror: తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదు…
ఇక అంజలి పోస్టుమార్టం అనంతరం తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్స్ ద్వారా వెళ్లడయ్యాయి. ఇక పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం తాను ఫుల్లుగా మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులను నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అంజలి ఘటనలో తన స్నేహితురాలు నిధి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























