గడిచిన 4 రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు తిండి తినకుండా, నీళ్లు తాగకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మార్గాల్లో బెదిరించినా రైతులు ఏ మాత్రం భయాందోళనకు గురి కాకుండా తమ ఆందోళనను శాంతియుతంగా తెలియజేస్తున్నారు. పోలీసుల నుంచి కష్టపడి అనుమతులు తెచ్చుకుని తమ నిరసనను తెలుపుతున్నారు. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలి పెడుతున్నా రైతులు అలాగే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి ఒక దాబా యజమాని తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఆమ్రిక్ సుఖ్‌దేవ అనే యజమాని అక్కడ ఆకలితో అలమటిస్తూ ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆహారం ఇస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. రెండు వేల మంది రైతులకు రెండు రోజులుగా దాబా యజమాని ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాబా యజమాని ఈ దేశానికి రైతు కంటే ఎవరూ ఎక్కువ ఇవ్వలేదని అన్నారు.
ఎంతమంది రైతులు వచ్చినా కడుపునిండా భోజనం పెడతానని.. వాళ్ల ఆకలి తీర్చడంలో పొందే ఆనందం అంతాఇంతా కాదని దాబా యజమాని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నాడని ఆ రైతుకు తన వంతు సహాయం చేస్తున్నానని దాబా యజమాని తెలిపారు. కడుపునిండా భోజనం పెడుతూ ప్రశంసలు అందుకుంటున్న దాబా యజమానిని అందరూ మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.
‘యూత్ కాంగ్రెస్’ సోషల్ మీడియా ద్వారా ముర్తాల్ దాబాలో రైతులు భోజనం చేస్తున్న దృశ్యలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు శాంతియుతంగా తమ నిరసనను తెలుపుతున్నారు.