Devara Movie: దేవర సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల కానుందా… మేకర్స్ సమాధానం ఇదే!

0
45

Devara Movie: యంగ్ టైగర్ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి తరుణంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కాబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ సినిమా గురించి ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఓ అభిమాని ఏకంగా సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ఈ విషయం గురించి ప్రశ్నించారు.దేవర సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించారు. ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు చిత్ర బృందం స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Devara Movie: ఇంగ్లీషులో విడుదల కాదు…


దేవర సినిమా ఇంగ్లీషులో కూడా విడుదల కాబోతోంది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ సినిమా ఇంగ్లీష్ భాషలో విడుదల కావడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.