Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.18 సంవత్సరాల వైవాహిక జీవితంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఐశ్వర్య కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించగా అందుకు ధనుష్ ఒప్పుకోలేదని సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

అదేవిధంగా ఈ మధ్యకాలంలో హీరో ధనుష్ మరొక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారనే విషయం కూడా వినపడుతుంది.ఇలా వారి మధ్యలోకి మరొక హీరోయిన్ రావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఐశ్వర్య ధనుష్ విడాకులు ఇవ్వాలని భావించినట్లు సమాచారం.
వారి నిర్ణయానికే వదిలేసిన రజిని…
ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో రజనీకాంత్ ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రజినీకాంత్ చివరికి వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారు.దీంతో వీరిద్దరు కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పెద్దఎత్తున ఫిలింనగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.మరి వీరు విడాకులకు అసలు కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే విషయం స్వయంగా ధనుష్ ఐశ్వర్య ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

































