Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా రవితేజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. రవితేజ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈయన నటించే సమయంలో చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకునేవారని తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రవితేజ ఏదైనా సినిమాలో నటిస్తే కేవలం ఈయనకు పది రూపాయలు రోజుకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారట. రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో ఆయన స్నేహితుడి పాత్రలో రవితేజ నటించిన రోజుకు పది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని నటించారని తెలుస్తుంది.
ఇలా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ మొదలైనటువంటి తన ప్రయాణం నేడు కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు ₹10 రెమ్యూనరేషన్ తో తన కెరియర్ ప్రారంభించినటువంటి రవితేజ ఇప్పుడు ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని చెప్పాలి.
కోట్లలో రెమ్యూనరేషన్…
ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని ఇదే అసలు సిసలైన సక్సెస్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో వరస సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే తన సినిమాలు హిట్ అయిన ఫ్లాపైన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఈయన తగ్గడం లేదని తెలుస్తుంది. అయితే ఈయన సినిమాలు ఫ్లాప్ అయిన తనకు అదే విధంగా అవకాశాలు రావటం విశేషం.































