ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కరోనా వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి తేజ్ పై ఇలాంటి వార్తలు రావడానికి ఒక ముఖ్యమైన కారణమే ఉంది. సాయి తేజ్ ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాను ఓటీటీ జీ 5కు విక్రయించారు. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీలో సోలే బతుకే సో బెటర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా సాయి తేజ్ కు కరోనా సోకడంతో డబ్బింగ్ పనులు ఆగిపోయాయని.. ఈ మేరకు సినిమా నిర్వాహకులు జీ ఛానల్ వాళ్లకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అయితే సాయి తేజ్ కు కరోనా సోకిందో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.

సాయి తేజ్ కు కరోనా నిర్ధారణ అయితే మాత్రం సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తం చెల్లించి జీ నిర్వాహకులు ఈ సినిమాను కొనుగోలు చేసిన నేపథ్యంలో జీ తెలుగు సినిమా రిలీజ్ ఆలస్యమైతే ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా నిర్ధారణ కాగా ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. రెండు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా సైతం కరోనా బారిన పడి వేగంగా కోలుకున్న విషయం విదితమే. అయితే సినీ ప్రముఖులకు కరోనా నిర్ధారణ అవుతూ ఉండటంతో ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here