Actress Rajani: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా 150 సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిన్నటితరం హీరోయిన్ గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించారు. తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన తప్ప మిగిలిన అందరితోనూ నటించి మంచి గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలో ఒక ఒక సమయంలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన రజిని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ గృహిణిగా ఇంటికే పరిమితం అయి తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా కొనసాగిన ఈమె ఎంతో చాకచక్యంగా ఇంగ్లీష్ మాట్లాడుతారు.

ఇలా ఇంగ్లీషులో ఏకధాటిగా మాట్లాడే రజినినీ చూస్తే ఈమె ఉన్నతమైన చదువులు చదువుకుందనీ భావిస్తారు. నిజానికి ఈమె పదవ తరగతి కూడా పూర్తి చేయలేదు. ఇలా పది కూడా పూర్తికాని రజిని ఏకదాటిగా ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
తమిళ సినిమాతో వెండితెరకు ఎంట్రీ…
రజిని పదవ తరగతి చదువుతున్న సమయంలో ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. 1984 లో డైరెక్టర్ మణివణ్ణన్ రజనిని ఎక్కడో చూసిన ఓ ప్రొడక్షన్ మేనేజర్ అమ్మాయి బాగుందని మణివణ్ణన్‌కు చెప్పాడు. దీంతో రజిని తల్లిదండ్రులకు కబురు పంపి తనకు సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పించారు.ఇలా తమ కూతురికి ఊహించని విధంగా సినిమా అవకాశం రావడంతో ఆమె తల్లిదండ్రులు కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొట్టమొదటిసారిగా హీరో మోహన్ సరసన “ఇళమే కాలందు” అనే తమిళ సినిమాలో నటించి వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె సినిమాలలో నటిస్తూ అగ్రతారగా కొనసాగారు.



























