దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మంచి ఉద్యోగం దొరికినా లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఉద్యోగం మానేసే వాళ్లకు కొన్ని కంపెనీలు నోటీస్ పీరియడ్ లో కూడా విధులు నిర్వహించాలని సూచిస్తాయి. కొందరు అంగీకరించి నోటీస్ పీరియడ్ లో కూడా విధులు నిర్వహిస్తే మరి కొందరు మాత్రం నోటీస్ పీరియడ్ లో విధులు నిర్వహించడానికి ఇష్టపడరు.

కంపెనీలో రాజీనామా లేఖను సమర్పించినప్పటి నుంచి కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నోటీస్ పీరియడ్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ సమయంలో కంపెనీ ఉద్యోగం మానేసిన వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని నియమించుకుని ఆ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నోటీస్ పీరియడ్ ముగిసిన తర్వాత మాత్రమే విధి నిర్వహణ నుంచి దూరం కావాలి తప్ప నోటీస్ పీరియడ్ సమయంలో మాత్రం విధులకు దూరం కాకూడదు.

కంపెనీలతో వివాదం లేకుండా ఉద్యోగం నుంచి తప్పుకుంటే మంచిది. అయితే కొన్ని కంపెనీలు జాబ్ మానేసిన వారికి నోటీస్ పీరియడ్ సమయంలో వేతనంలో కోత విధిస్తూ ఉంటాయి. వేతనంలో కోత విధించడం వల్ల నోటీస్ పీరియడ్ సమయానికి ఉద్యోగి టీడీఎస్ ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు నోటీస్ పీరియడ్ లో పేర్కొన్నన్ని పని దినాలు పని చేయకపోయినా నోటీస్ పీరియడ్ ప్రకారం టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఉద్యోగులు టీడీఎస్ పై రిఫండ్ పొందే అవకాశం ఉండటం వల్ల ఉద్యోగులు టీడీఎస్ చెల్లించినా నష్టపోయే అవకాశం ఉండదు. ఉద్యోగులు నోటీస్ పీరియడ్ నియమ నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here