Bangarraju Movie: గత కొంతకాలం నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య పెద్ద యుద్ధం నడుస్తోందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఒక్కరిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించింది.ఈ క్రమంలోనే సినిమా రేట్లను తగ్గించడం వల్ల చాలామంది నష్టపోతారని టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరొక సారి పునరాలోచన చేయాలని సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో కెల్లా బంగార్రాజు సినిమా పెద్ద సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పకపోయినా అబవ్ యావరేజ్ అని చెప్పవచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటివారం ఎంతో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా దాదాపు 80 శాతం పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఏ సినిమాలో జరగని అద్భుతం బంగార్రాజు సినిమాలో ఎందుకు జరిగింది అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
ఈ సినిమాకు పర్మిషన్ ఉంది..
సాధారణంగా ఏపీ ప్రభుత్వం కేటాయించిన టికెట్ల రేట్లను బట్టి ఏ సినిమాకి కూడా 100 రూపాయలకు పైగా టికెట్లను అమ్మకూడదు. కానీ నాగార్జున బంగార్రాజు సినిమా కోసం ఏపీలో థియేటర్లు 150,200 రూపాయలతో టికెట్లు అమ్మారు.ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ సినిమాకు పర్మిషన్ ఉంది అనే సమాధానం వినబడుతోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది ఏపీ ప్రభుత్వానికి బంగార్రాజు సినిమా విషయంలో పేదవారు కనిపించడం లేదా ఎందుకీ పక్షపాతం అంటూ పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.































