Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా దిల్ రాజు వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారు.

ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు అనిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈమె వివాహం జరిగి తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే గుండెపోటుతో అనిత మరణించడంతో దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు.

తేజస్విని దిల్ రాజు దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.అయితే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు తన భార్య తేజస్వినికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. తేజస్వినికి కాలేజీ చదువుతున్న రోజులలోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని ఎంతో ఆశగా ఉండేదట అయితే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఈమె తన కోరికను చంపుకున్నారు.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న తేజస్విని..
ఇక దిల్ రాజును పెళ్లి చేసుకున్న తర్వాత మరోసారి ఈమె తన కోరికను తన భర్త ముందు ప్రస్తావించడంతో ఆయన తన భార్య కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే తనని మోడలింగ్ రంగంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అదేవిధంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడానికి తేజస్విని సిద్ధమవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.































