మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమాగా, అలాగే దిల్ రాజ్ కెరిర్ లో 50వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ కోసం పూనేకి వెళ్లిన ఈ సినిమా బృందం ఆ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. దీపావళి తర్వాత ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది.
ఈ సినిమాలో సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మొదటి షెడ్యూల్ పూర్తవగానే రామ్ చరణ్ ముంబై కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై విమానాశ్రయంలో కనిపించిన చరణ్ ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరిష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయబోతున్నారు. శిరీష్, దిల్ రాజు తమ బ్యానర్ లో మరే సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ తో, గ్రాండ్ స్కేల్ తో ఇండియన్ సినిమాల్లో ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్ రాజు శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్కో కోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు.






























