Director Geetha Krishna : ఏపీ రాజకీయాలలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సి ఎన్నికలు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఊపిరినిస్తుంటే వైసీపీ మాత్రం అదే ఫైనల్ కాదు ముందుంది ముసళ్ల పండగ అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే పార్టీలన్నీ వచ్చే ఎన్నికల కోసం ఎవరికి వారు వ్యూహాలు రచిస్తుండగా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్ గెలిచి ఈసారి 175 సీట్లు గెలుస్తాడంటూ టీడీపీ మొన్న ఎన్నికల్లో గెలిచిన 23 సీట్లకంటే ఒక్కటి ఎక్కువ గెలిచినా చంద్రబాబు వ్యూహలు ఫలించినట్లే అంటూ డైరెక్టర్ గీతా కృష్ణ అభిప్రాయపడుతున్నారు.

జగన్ మరో రెండు నెలల్లో షాకిస్తాడు…
గీతా కృష్ణ మాట్లాడుతూ జగన్ కొన్ని తప్పులు చేసాడు వాటిని సరి చేసుకుంటే అతనే బెస్ట్ సీఎం అంటూ చెప్పారు. టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సి సీట్లు గెలవగానే సంబరపడిపోతున్నారు ఇంకా జగన్ గేమ్ స్టార్ట్ చేయలేదు. మరో రెండు నెలల్లో మొత్తం పరిస్థితి మార్చేస్తాడు చూడండి అంటూ చెప్పారు. వ్యూహాలు రచించడంలో చంద్ర బాబు తోపు అంటుంటారు జగన్ స్ట్రాటెజీస్ తట్టుకుని వచ్చే ఎన్నికలలో గత ఎన్నికల్లో గెలిచిన 23 సీట్లకంటే ఒక సీటు ఎక్కువ గెలిస్తే చాలు అంటూ అభిప్రాయపడ్డారు.

వైజాగ్ లోని రిషి కొండ గ్రీన్ మ్యాట్ వ్యవహారం గురించి మాట్లాడుతూ ఎందుకూ పనికి రాని కైలాస పర్వతం మీద అలా మొత్తం తొలగించి ఇప్పుడు పెయింటింగ్స్ వేయించాడు చాలా బాగుంది ఇటువంటివి నిదానంగా తెలుస్తాయి అంటూ వాళ్ళ బాబాయి హత్య, రిజిస్ట్రేషన్ లో లోపాలు వంటివి తప్ప జగన్ అన్ని విషయాల్లోను చాలా బాగా పరిపాలిస్తున్నాడు, ఆ తప్పులను సరిదిద్దుకుంటే చాలు అంటూ చెప్పారు గీతా కృష్ణ.

































