Director Teja: సినీ దర్శకుడు తేజ ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా తేజ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో ప్రేమకథ సినిమాలు ఇప్పటికీ చాలా కొత్తదనంగానే అనిపిస్తాయి. ఇలా తేజ డైరెక్షన్లో ఎన్నో ప్రేమకథ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా తేజ అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఇద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది అయితే ఉదయ్ కిరణ్ మరణం గురించి ఈయన మాట్లాడుతూ తన మరణించడం చాలా పాపం అంటూ తెలియజేశారు. ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తనకు తెలుసని అయితే చనిపోయే లేపు ఆ విషయాన్ని బయటపెట్టి చనిపోతానని తేజ వెల్లడించారు.

Director Teja: ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో తెలుసు…
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఉదయ్ కిరణ్ మరణం గురించి మరో ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ ఉదయ్ కిరణ్ ఎలా మరణించారు అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రతి ఒక్కరు నాటకాలు ఆడుతున్నారని ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.