Director Teja: నేను చేసిన పొరపాటు వల్ల నా ఇల్లు జప్తు చేశారు… డైరక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్?

0
21

Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన తేజ గత కొంతకాలంగా సరైన విజయం అందుకోలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని ఇండస్ట్రీలో హీరోగా పరుచయం చేసే బాధ్యతను తీసుకున్నారు.ఈ క్రమంలో అభిరామ్ హీరోగా ‘ అహింసా ‘ అనే సినిమా రూపొందించారు.

తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు కూడా ప్రారంభించారు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ తన జీవితంలో ఉన్న ఎత్తు పల్లాలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో తేజ మాట్లాడుతూ..’జీవితంలో నాకు జరిగిన అవమానాలు, చేసిన తప్పులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.

ఎందుకంటె జీవితంలో మళ్లీ వాటిని చేయకూడదని గట్టిగా భావిస్తున్నానని తెలిపాడు. ఈ మేరకు ఒకసారి ఇంటిపై లోన్‌ తీసుకున్నట్లు తెలిపాడు. నాలుగు సంవత్సరాల పాటు సినిమాల అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అందువల్ల లోన్ కట్టలేని నేపథ్యంలో బ్యాంక్‌ వాళ్లు ఇంటిని జప్తు చేస్తున్నట్లు గోడకు నోటీసు రాసిపెట్టారు అని తెలిపాడు అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాంక్‌కు డబ్బులు మొత్తం చెల్లించాను.

Director Teja: నోటీస్ ఇంటి గోడకు అలాగే పెట్టాను….

ఆ సంఘటన వల్ల ఇక జీవితంలో ఎప్పుడు లోన్‌ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం బాంక్ వాళ్లు ఇంటికి అంటించిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచాను అని తెలిపాడు. ఇక ఆ తర్వాత తన సినిమాల గురించి మాట్లాడుతూ..నేను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్‌లు అయ్యాయి. సినిమా చేస్తున్నప్పుడే హిట్‌ లేదా ఫ్లాప్‌ అనేది తెలుస్తుంది. అందుకే ఏ సినిమాపైనా నేను ఆశలు పెట్టుకోను” అని తేజ వివరించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీ లో లాంచ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తేజ తెలిపారు.