V.V Vinayak: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికలపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎలాగైనా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పార్టీ నేతలు పెద్ద ఎత్తున కసరత్తులు మొదలు పెడుతున్నారు.

ఇకపోతే తాజాగా వైఎస్సార్సీపీ పార్టీలోకి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈయన వైసిపి పార్టీలోకి వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారింది ఇప్పటికే వినాయక్ కుటుంబ సభ్యులకు కొందరు వైసిపి పార్టీలో ఉన్నారు. దీంతో ఈయన కూడా పార్టీలోకి రాబోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి.
రాజకీయాలు పడవు..
ఇటీవల వినాయక్ కాకినాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ఈయన కూడా కనిపించడంతో తప్పకుండా ఈయన పార్టీలోకి వస్తున్నారని అందరూ భావించారు ఈ క్రమంలోనే వైసిపి పార్టీలో ఉన్నటువంటి వినాయక్ సోదరుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. వినాయక్ గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని, తనకు రాజకీయాలు అంటే పడవని తెలిపారు. ఈ వార్తలు కేవలం అవాస్తవాలేనని ఈయన కొట్టి పారేశారు.




























