ఆకాశంలో వింతలు.. విశేషాలకు కొదవ ఉండదు. విశ్వం వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇవి సాగుతూనే ఉన్నాయి. ఎన్నో కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వింత వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అమెరికాలోని ఓ ప్రయోగశాల నిరంతరం ఆకాశంలో చోటుచేసుకునే వాటిని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు.

అయితే అలా తీసిన వీడియో, ఫొటోలో ఒకచోట 9 వింత నక్షత్రాలు కనిపించాయి. అరగంట తర్వాత అవి మాయం అయ్యాయి. ఈ చిత్రాలు తీసింది 12 ఏప్రిల్ 1950 లో.. కానీ వాటిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఈ విషయంపై ఆసక్తి కలిగింది. ప్రస్తుతం భారత్ సహా మరికొన్ని దేశాలు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనల ప్రారంభ అధ్యయనాన్ని ఇటీవల ప్రచురించారు. ఈ ప్రచురణల్లో బలంగా చెప్పిన అంశం ఆసక్తి కలిగించేదిగా ఉంది. గ్రహాంతర వాసుల గురించి ఇప్పుడు చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ పరిశోధనల ప్రచురణ ప్రాముఖ్యత సంతరించుకుంది. భారతదేశంతో పాటు మరికొన్ని దేశాలు ఆకాశంలో మరో ప్రపంచం ఉందని అంగీకరించాయి. ఆకాశంలో కనిపించే విషయాలను పరిశోధించడానికి, సౌర ప్రతిబింబాల యొక్క డిజిటలైజ్డ్ డేటాను చూడాలి. ప్రపంచంలోని బలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూసిన తరువాత ఆ 9 నక్షత్రాలు మళ్లీ కనిపించలేదు. సిసిడి డిటెక్టర్ సర్వేలో కూడా ఈ నక్షత్రాలు కనిపించలేదు.
ఇలా ఏ టెలిస్కోప్ ద్వారా చూసినా కనిపించకపోవడంతో దీని వెనుక రేడియోధార్మిక కణాలు ఉండవచ్చని ఒక వర్గం చెబుతోంది. మరికొంత మంది ఈ 9 నక్షత్రాలు గహంతరవాసులు వాడుకునే ఓడ అని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు ఆ 9 నక్షత్రాలు ఏంటనే దానిపై క్లారిటీ మాత్రం రాలేదు.



























