Panipuri Water: ఈ మధ్యకాలంలో పానీపూరి ప్రియులు మరింత పెరిగారు. అంతేకాకుండా పానీ పూరి స్టాల్స్ కూడా విరివిగా పెరిగాయి. ఇక పానీపూరి అతిగా తినడం వల్ల అది మన ఆరోగ్యానికి ముప్పు అని కొందరు సూచిస్తుంటే. కొంతమంది నిపుణులు మాత్రం పానీ పూరి నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

అవేమిటో మనము ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. పానీ పూరి లో ఎక్కువగా ఉపయోగించే వేడి నీరు రుచిగా ఉండే కారం ఇది మన శరీరానికి ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గాలనుకునేవారు ఈజీ గా బరువు తగ్గవచ్చు. ఇక డైటీషియన్ లు ఏమని సలహా ఇస్తున్నారా అంటే ఇంట్లో తయారుచేసిన పానీపూరి తినడం శరీరానికి మంచిదని తెలియజేస్తున్నారు.

ఎందుకంటే ఇంట్లో తయారుచేసిన పానీ పూరి లో పుదీనా, జీలకర్రను తగిన మొత్తంలో వేసుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన నీటిని పానీపూరి లో ఉపయోగిస్తారు. తద్వారా కడుపు ఉబ్బరం, అలసట వంటి సమస్యలను దూరం పెట్టవచ్చు. పుదీనా కలిపిన పానీ పూరి ను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.
పుదీనా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
ఇందులో కలిగే పుదీనా నీరు శరీర బరువు తగ్గడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఇక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా పుదీనా మంచిగా సహాయ పడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా పానీ పూరిలో ఉపయోగించే జీలకర్ర మన శరీర ఆరోగ్యంలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.































