Ennenno Janmala Bandham Child Artist: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సీరియల్ సినిమా ద్వారా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విధంగా మొదటి సినిమా లేదా సీరియల్ తోనే ఎంతోమంది విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఖుషి ఒకరు.

ఈ సీరియల్ లో ఖుషి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ మొదటి సీరియల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఖుషి పాత్రలో నటిస్తున్నటువంటి ఈ చిన్నారి అసలు పేరు నైనిక. తన ముద్దు పేరు మిన్ను సంగారెడ్డికి చెందిన ఖుషి ఊహా తెలిసినప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ వీడియోస్, టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు…
ఇలాంటి టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నైనిక అనంతరం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సీరియల్ లోఖుషి తన అమాయకపు నటనతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఖుషి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నైనిక క్యూట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి.
