టాలీవుడ్ లో తిరుగులేని చరిత్ర సృష్టించారు మెగా స్టార్ చిరంజీవి.. అరంగేట్రం దగ్గరినుంచి ఇప్పటివరకు అదే తరగని అభిమానం.. అదే తగ్గని క్రేజ్ అయన సొంతం.. ఇప్పటికీ అయన సినిమా వస్తుందంటే పాతకాలం రోజుల్లాగా అభిమానం పొంగిపొర్లుతోంది.. OTT , మల్టీప్లెక్స్ లు అంటూ సినిమా చూడడం మారిపోయినా రోజుల్లో కూడా చిరు సినిమా వచ్చిందంటే చాలు ముసలాడాయినా పడచు అబ్బాయి అయిపోవాల్సిందే.. రాజకీయాల్లోకి చిన్న గ్యాప్ ఇచ్చి చిరంజీవి మళ్ళీ సినిమా బాట పట్టాడు.

వస్తూనే ఖైదీ నెంబర్ 150 సినిమా తో సూపర్ హిట్ కొట్టాడు. అదిరిపోయే రీ ఎంట్రీ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు సైరా తో మళ్ళీ తన స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నాడు.. ప్రస్తుతం ఆచార్య సినిమా తో బిజీ గా ఉన్న చిరంజీవి ఈ సినిమా తర్వాత వేదాళం రీమేక్, లూసిఫర్ సినిమా ల రీమేక్ లు చేస్తున్నాడు.. స్ట్రెయిట్ సినిమాలను వదిలేసి చిరు ఎందుకు ఈ రీమేక్ సినిమాలు చేస్తున్నాడు అనే సందేహం అందరిలో కలగడం సహజమే.. దానికి అయితే సమాధానం లేదు కానీ చిరంజీవి ఇప్పటివరకు నటించిన రిమేక్ చిత్రాలు ఏవో ఓ లుక్ వేద్దాం..
అయన నటించిన చట్టానికి కళ్ళు లేవు చిత్రం 1981 లో రాగా ఆ చిత్రం తమిళంలో హిట్టైన సట్టం ఓరు ఇరుత్తరయ్ రీమేక్.. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక శాండిల్ వుడ్ లో హిట్టైన పట్టనెక్క బంద పత్నియరు సినిమా తెలుగులో పట్నం వచ్చిన పతివ్రతలు గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మోహన్ బాబు కూడా నటించారు. ఇక చిరు కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమా ఖైదీ. ఇది రీమేక్ కాకపోయినప్పటికీ హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ కి ఇది ఇన్స్పిరేషన్.. ఇక చిరు కి మంచి విజయాన్ని అందించిన విజేత సినిమా హిందీలో హిట్టైన సాహెబ్ సినిమాకు రీమేక్. పసివాడు ప్రాణం కూడా మలయాళంలో హిట్టైన పూనివా పుతికా సినిమాకు రీమేక్. చిరంజీవి కెరీర్ లో హిట్లైన ఘరానా మొగుడు,ఖైదీ నెంబర్ 786, హిట్లర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు కూడా రీమేక్ సినిమాలే..






























