Nagashaurya: సినీ నటుడు నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ప్రేక్షకులకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ తరువాత వచ్చినటువంటి చలో సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి.

ఇలా నాగశౌర్య ఏడాదికి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయనకు మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందలేకపోతుందని చెప్పాలి ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవు. ఇకపోతే నాగశౌర్య గత ఏడాది నవంబర్ నెలలో అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
అనూష శెట్టి బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె బెంగళూరులో మాత్రమే కాకుండా హైదరాబాద్ లో కూడా ఎంతో పెద్దపెద్ద రెస్టారెంట్లతో పాటు ప్రముఖల ఇంటికి డిజైనర్ గా పనిచేస్తూ వచ్చారు. ఇలా క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు అంటూ ఇటీవల నాగశౌర్య తల్లి ఉష వెల్లడించిన సంగతి తెలిసిందే.
నెలకు 30 లక్షలు…
తాజాగా అనూష శెట్టి నెల ఆదాయం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె నెలకు ఎంత మొత్తంలో సంపాదిస్తారనే విషయం గురించి ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈమె నాగశౌర్య కంటే ఏడాదికి రెండింతల ఆదాయం సంపాదిస్తుందని చెప్పాలి. నాగశౌర్య ఒక సినిమా చేస్తే దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అయితే అనూష శెట్టి నెలకు 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఈమె సంపాదన గురించి ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
































