సాధారణంగా రాత్రి అన్నం తిన్న తర్వాత ఎంతో కొంత మిగులుతుంది. దానిని చాలామంది ఉదయం తినే అలవాటు ఉంటుంది. దీనినే మనం చద్దిఅన్నం అని పిలుస్తాం. ఈ చద్ది అన్నం తినడం వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో ఎన్ని రకాల లాభాలుంటాయో అధ్యయనం చేసి మరీ వెల్లడించింది.

వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం పులిస్తే ఎక్కువగా కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటివి పెరుగుతాయి. రాత్రి మిగిలిన 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లిగ్రాముల ఐరన్ ఉంటే.. ఉదయం దానిలో ఐరన్ అనేది 70కి పైగా మిల్లీ గ్రాములకు పెరుగుతుందట.
అందుకే చద్ది అన్నంలో పోషకాలకు కొదవ ఉండదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చద్దన్నంను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరం లైట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. ఎన్నో ఫలితాలను పొందొచ్చు. ఇలాంటి రైస్ తినడం వల్ల స్లిమ్ గా కూడా తయారు కావచ్చు.
అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం కూడా. ఇందులో ఎక్కువగా బి6, బి12ను వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్ని ఈ రైస్ తీసుకోవడం వల్ల ఉభకాయం రాకుండా కూడా ఉంటుంది. చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

































