జూనియర్ నందమూరి తారకరామారావు.. ఓ వైపు సినిమాలు తీసుకుంటూనే ఓ వైపు బుల్లితెరపై మెరుస్తున్నాడు. అతడు హెస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఇది మంచి రేటింగ్ తో దూసుకుపోతోది. ఎన్టీఆర్ హోస్ట్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ షోకు అప్పుడప్పుడు సెలెబ్రిటీలను కూడా పిలుస్తున్నారు. వాళ్లు చేసే సందడితో ఆ రోజు టీఆర్పీ కూడా విపరీతంగా వస్తుంది. ఇదంతా ఇలా ఉండగా.. ఈ షో లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఎన్టీఆర్ చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు ఎక్కువగా ఇష్టమైన సినిమా ‘తొలిప్రేమ’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది విన్న పవన్ ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఈ షోకి మహేశ్ బాబు గెస్ట్ గా వస్తున్నట్లు ఇటీవల అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ లో మహేశ్ బాబుకు ఓ క్వచ్చన్ కు సంబంధించి ఆన్సర్ తెలియకపోతే ఫోన్ ఏ ఫ్రెండ్ కు వెళ్లగా.. అందులో పవన్ కళ్యాణ్ కు కాల్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో అతడు సపోర్ట్ చేసినట్లు సమాచారం. ఈ సంభాషణలోనే పవన్ కు.. మీరు నటించిన సినిమాల్లో తొలిప్రేమ అంటే ఇష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఒకే ఎపిసోడ్ లో ముగ్గురు స్టార్ హీరోలు ఓకె ఫ్రేమ్ లో కనిపించనున్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2 న ప్రీమియర్ కానుంది.
































