Ramcharan Remuneration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అటు మెగస్టార్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా.. రామ్ చరణ్ కు సపోర్టు చేస్తారన్న విషయం విధితమే. ఇక ప్రస్తుతం చరణ్.. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తుండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అతడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అతడు తీసే ప్రతీ సినిమా ఇక ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా.. శంకర్, గౌతమ్ తిన్ననూరితో తన ప్రతీ ప్రాజెక్ట్‌కి రూ. 100 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.
హాట్ టాపిక్ గా మారిన రామ్ చరణ్ రెమ్యూనరేషన్:
కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ మెగస్టార్ ను, రామ్ చరణ్ కలిసి రెండు కథలను వినిపించడాట. కథలు నచ్చకపోవడంతో అందులో కాస్త మార్పులు చేయాలని సూచించారట. దీనిలో అతడు మార్పులు చేర్పులు చేశాడట. అందులో ఓ కథ ఎక్కువగా యాక్షన్ స్టోరీతో ఉండగా.. దానిని రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోల స్థాయిలో దూసుకెళ్లడంతో… టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.































