Aravind Swamy: అరవింద్ స్వామి.. పేరును ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. రోజా, బొంబాయి వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలు తెలుగులో విడుదలై.. చాలా పెద్ద హిట్ సాధించాయి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. రజినీకాంత్ దళపతి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అరవింద స్వామి.. ఆ సమయంలో అమ్మాయిల కలకల రాకుమారుడిగా నిలిచారు.

అయితే ఆ తరువాత సినిమాలు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో వెండితెరకు దూరమై.. బిజినెస్ చూసుకుంటున్నాడు. అయితే తమిళ సినిమా ‘తనిఒరువన్’ సినిమాతో స్టైలిష్ విలన్ గా మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో రామ్ చరన్ తేజ హీరోగా ‘ధృవ’గా వచ్చింది. ఇందులో కూడా విలన్ రోల్ ని అరవింద స్వామి పోషించాడు. ఇటీవల తలైవి మూవీలో ఎంజీఆర్ రోల్ లో అరవింద స్వామి నటించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అరవిందస్వామి భార్య అపర్ణ ముఖర్జీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆమె నెల సంపాదన, ఆమె వృత్తి, ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ఇంట్రస్టింగ్ విషయాలను గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో అపర్ణా ముఖర్జీ ఒకరు. ఆమెకు విదేశాల్లో కూడా న్యాయవాదిగా వాదించే లైసెన్స్ ఉంది. దేశంలో పలు కార్పోరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామిక వ్యక్తులకు సేవలు అందిస్తుంటారు.
ఈ సంపాదన చూసి ప్రస్తుతం ప్రజలు షాక్ ..
ఇంతే కాకుండా.. అరవింద్ స్వామికి చెందిన పలు కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్‌గాను, బయట కంపెనీలకు లీగల్ సలహదారుగా ఉంటూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇవి కాక ఆమె సొంత కంపెనీల నుంచి కొంత ఆదాయం ఆమె వాటాగా వస్తుంది. దీంతో నెలకు సుమారుగా రూ. 30-40 కోట్లను ఆర్జిస్తోంది. ఈ సంపాదన చూసి ప్రస్తుతం ప్రజలు షాక్ అవుతున్నారు. ఓ స్టార్ కు భార్యగా ఉండీ.. ఈ రేంజ్ లో సంపాదిస్తుండటం చూసి నోరెళ్లబెడుతున్నారు.































