కొత్తిమీర వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?

0
90

సాధారణంగా కొత్తిమీరను అన్ని రకాల వంటలో ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఈ కొత్తిమీరను కొందరు ఆహారంలో రుచి కోసం మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.మరికొందరు కూరలలో కోతిమిర కనిపిస్తే తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ కొత్తిమీరలో ఉండే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలిస్తే ఒక్కరు కూడా కొత్తిమీరను తినకుండా ఉండరు. అయితే కొత్తిమీరను తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్తిమీర ఆకుల నుంచి మొదలుకొని కాండం వరకు ఎన్నో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సి, కె ఇందులో విరివిగా లభిస్తాయి. కొత్తిమీర ఆకులు, కాండంలో పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి.ఈ పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీబయాటిక్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంతో పాటు, అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తిని కల్పిస్తుంది.

ఇందులో ఉన్న విటమిన్ ఏ, సి, కె రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచి కంటిచూపును పెంపొందించడంలో విటమిన్ ఏ తోడ్పడుతుంది. అధిక రక్తస్రావం ఉన్న వారికి విటమిన్ కే ఎంతగానో ఉపయోగపడుతుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు కోతిమిర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఐరన్ పుష్కలంగా లభించే ఈ కొత్తిమీరను ఆహారంలో ఉపయోగించడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న కొత్తిమీరను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here