ఏడుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

0
236

ఏదైనా విషాద ఘటన చోటు చేసుకున్న సమయంలో, మనం అనుకున్న అనుకున్న విధంగా జరగని సమయంలో మన కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సంతోషం కలిగించే వార్త విన్నా కంటి నుంచి ఆనంద భాష్పాలు కారతాయి. ఏడిస్తే మన మనస్సు కొంత తేలిక పడుతుంది. అయితే శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి ఏడుపు వల్ల కూడా అనేక లభాలు ఉన్నాయని, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

ఈ భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఏడుస్తూనే బయటకు వస్తాడు. పుట్టిన బిడ్డ ఏడవటం తన రాకను ప్రపంచానికి పరిచయం చేసే ప్రక్రియ. మనం కార్చే కన్నీళ్లలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి కళ్లను శుభ్రం చేసే కన్నీరు కాగా రెండోది కలక కన్నీరు మూడోది భావోద్వేగ కన్నీరు. మనం ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపించే సమయంలో భావోద్వేగ కన్నీళ్లు కంటి నుంచి వస్తాయి. ఈ కన్నీళ్లు మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ఏడుపు సహకరిస్తుందని యేలె యూనివర్సిటీకి చెందిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరైతే ఎక్కువ సమయం ఏడుస్తారో వారి శరీరం నుంచి ఎండోజెన్స్ ఒపియడ్స్, ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఎవరైతే ఎక్కువ సమయం ఏడుస్తారో వారికి మనస్సు కుదుటపడి మానసిక ప్రశాంతత కలుగుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఒక సర్వే ఎవరైతే ఏడ్చి నిద్రపోతారో మంచి నిద్ర పట్టడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన కన్నీటిలో ఐసోజిమ్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండే ఈ ఎంజైమ్ కళ్లలోకి బ్యాక్టీరియా చేరకుండా రక్షిస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు ఏడుపు వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నాయి.