సాధారణంగా అందరూ పండ్లరసాలను తాగడానికి ఎంతో ఇష్ట పడుతుంటారు. ఒక్కొక్కరు వారి అభిరుచికి అనుగుణంగా ఒక రకమైన పండ్ల రసాలను తాగుతుంటారు. కానీ ఈ పండ్ల రసాలలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరించడంతో ఈ నిమ్మరసం తాగే వారి సంఖ్య కూడా పెరిగింది. నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

నిమ్మ కాయలు సిట్రస్ జాతికి చెందినది కాబట్టి ఈ నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి మన శరీరానికి తగినంత అందటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాలు, వైరస్ లు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు రోగనిరోధకశక్తి వాటితో పోరాడి వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఈ నిమ్మరసం తాగడం వల్ల మధుమేహ వ్యాధితో బాధ పడేవారీ శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది.

మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుంది.మన శరీరంలో రక్తం సరఫరాను మెరుగుపరిచేడమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను సైతం దూరం చేస్తుంది. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. అదేవిధంగా మన శరీరం ముడతలు పడకుండా అందంగా ఉండటానికి కూడా నిమ్మరసం తోడ్పడుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల కిడ్నీలో ఏర్పడినటువంటి రాళ్ళను కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈవిధంగా నిమ్మరసం తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here