మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా..??

0
137

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా స్టోరీ సెలెక్షన్ విషయంలో మహేష్ చాలా ప్రాక్టీకల్ గా ఆలోచిస్తారు..ఇక వ్యక్తిగతంగా కూడా అందరి హీరోలు లాగా మొహమాటాలకు పోయే హీరో కాదు. ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకూ ఉండాలి లాంటి వాటిల్లో మహేష్ ముదురిపోయాడు. అందుకే దర్శకులు మహేష్ తో చాల ప్లాన్డ్ గా ఉంటారు.

రిలేషన్ ఉంది కదా అని, మహేష్ తరువాత మనకే ఛాన్స్ ఇస్తాడు అనుకున్న వంశీ పైడిపల్లి వంటి డైరెక్టర్లు తరువాత భంగపడాల్సి వచ్చింది.అంతెందుకు గతంలో త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమాకి ప్రయత్నం చేసి విసిగిపోయాడు. అప్పుడు త్రివిక్రమ్ సక్సెస్ ట్రాక్ కాస్త సైడ్ కి టర్న్ తీసుకుంది. అందుకే మహేష్ సినిమా ఇవ్వలేదు.

ఆ ఇగో త్రివిక్రమ్ ను చాల నెలలు బాధ పెట్టింది. అంతలో త్రివిక్రమ్ వరుసగా హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి రావడంతో, మొత్తమ్మీద త్రివిక్రమ్ తో సినిమా చేయాలని మహేష్ భావించాడు.వెంటనే నమ్రత రంగంలోకి దిగి త్రివిక్రమ్-మహేష్ మధ్య సయోధ్య కుదిర్చి సినిమాని సెట్ చేసింది. అయితే, గతంలో మహేష్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఖలేజా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి మహేష్ ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. నిజానికి ఆ సినిమా ప్లాప్ తోనే త్రివిక్రమ్ – మహేష్ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. అప్పటి నుండే మహేష్, త్రివిక్రమ్ ను పక్కన పెట్టాడు.ఎలాగూ ఖలేజా సినిమా వచ్చి పదేళ్లు పైనే అవుతుంది.

ఒక విధంగా మహేష్ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన ఘనత మాత్రం త్రివిక్రమ్ కే దక్కుతుంది. అందుకే ఆ సినిమాని మహేష్ మర్చిపోయినా.. అతని సన్నిహితులు గుర్తు చేసి ఎప్పటికీ ఆ సినిమా మీ కెరీర్ లో స్పెషల్ మూవీ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అందుకే మహేష్ కి కూడా త్రివిక్రమ్ పై మళ్ళీ బ్లైండ్ గా నమ్మకం పెరగడానికి అది కూడా ఒక కారణం అట.ఆలాగే మహేష్ కెరీర్ లో మరో అత్యున్నతమైన సినిమా ‘అతడు’. ఈ బ్లాక్ బస్టర్ మూవీనే మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. అందుకే ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మహేష్ త్రివిక్రమ్ తో సినిమా సెట్ చేసుకోవడానికి బాగానే ప్లాన్స్ చేశాడు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here