RK Roja: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్న రోజా వైసీపీ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె జగన్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా రోజా పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేసేవారు.అయితే ప్రస్తుతం ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇకపోతే రోజా రాజకీయాలలోనూ సినిమాలలోను నటించిన ఆస్తుల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రోజా ఆస్తులు విలువ 7 కోట్ల 38 లక్షల రూపాయలు కావడం విశేషం. రోజా ఆస్తులలో స్థిరాస్థుల విలువ 4 కోట్ల 64 లక్షల రూపాయలు కాగా చరాస్థుల విలువ 2 కోట్ల 74 లక్షలు. ఇక ఈమె కూతురు కొడుకు పేర్లపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇక తన భర్త సెల్వమణి ఆస్తుల విషయానికి వస్తే.. ఆయనకు ఎలాంటి స్థిరాస్థులు లేవు. చరాస్థులు మాత్రం 58 లక్షల 2 వేల రూపాయలుగా ఉంది. 22 లక్షల రూపాయల వరకు అప్పు ఉన్నట్టు తెలుస్తోంది.

ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన.. రోజా
ఇకపోతే నటి రోజాకు కార్లు అంటే ఎంతో ఇష్టం కనుక ఈమె దగ్గర ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా సినీ ప్రపంచానికి దూరమయ్యారు. గత పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజాకు మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉన్నారు.































