బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా పదకొండవ వారంలో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.ఇక ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది ఉండగా వీరందరూ ఎవరికి వారు గట్టిపోటీ ఇస్తూ ఉన్నారు.

ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ లు గా రవి, శ్రీ రామచంద్ర, సన్నీ ఉంటారని తెలుస్తోంది.
రవి యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల విషయంలో తన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎంతో అద్భుతంగా పూర్తి చేస్తున్నారు. మొదటినుంచి రవి టాప్ 3 కంటెస్టెంట్ లో ఒకరిగా ఉంటారని వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇండియన్ ఐడల్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీరామచంద్ర కూడా టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉంటారని పలువురు భావిస్తున్నారు.
ఇకపోతే ఈ సీజన్ విజేత ఎవరు అనే విషయానికి వస్తే చాలా మంది ఈ సీజన్లో విజేతగా సన్నీ నిలుస్తారని భావిస్తున్నారు. ఈ సీరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సన్నీ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న తనదైన శైలిలో ప్రేక్షకాదరణ పొందారు. ఈ క్రమంలోనే సన్నికి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అందుకే సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలుస్తారని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ విన్నర్ రేస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ తన బిహేవియర్ వల్ల ఈ రేసు నుంచి తప్పుకున్నారు.































