పుట్టలో పాములకు పాలు పోయడానికి గల కారణం ఇదే..!

0
341

హిందూ ఆచారాల ప్రకారం పాముకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పాము సాక్షాత్తు ఆ పరమశివుడి అంశంగా భావించి పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా నాగ పంచమి, ప్రత్యేకమైన పర్వదినాలలో లేదా శుభకార్యాలప్పుడు పుట్టకు ప్రత్యేకమైన పూజలను చేయడం మనం చూస్తున్నాము. ఈ పండుగలప్పుడు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి నైవేద్యం సమర్పించి రావడం ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం.అయితే పుట్టలో పాముకు ఎందుకు పాలు పోస్తారు అనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే ఆ విధంగా పుట్టలో పాలు ఎందుకు పోస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా పుట్టలు ఎప్పుడూ కూడా పంట పొలాలలో మనకు కనిపిస్తూ. ఆ పుట్టలో పాములు చేరుకొని మన పంటపొలాలో పంటను నాశనం చేసే క్రిమిసంహారకాలను నాశనం చేసి పంటపొలాలకు రక్షణ కల్పిస్తున్నాయి. అలాంటి పాములను మనుషులు చూసినప్పుడు వాటిని ఏమైనా చేస్తారేమో అన్న భయంతో అవి మనుషులపై దాడి చేయడం జరుగుతుంటాయి. అదేవిధంగా మనుషులు కూడా పామును చూడగానే మనల్ని కాటేస్తోందన్న భయంతో వాటిని చంపేస్తారు.

ఈ విధంగా మనుషులకు పాములకు మధ్య భయభ్రాంతులు ఏర్పడటం వల్ల ఎన్నో పాములు చనిపోతున్నాయి.అయితే మన పెద్దవారు వీరిద్దరి మధ్య ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం నాగుల పంచమి రోజు లేదా ప్రత్యేక పర్వదినాలలో పుట్టలో పాలు పోయడం వంటి భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ విధంగా పుట్టలో పాలు పోసి ఆ నాగరాజును దర్శించుకోవడం వల్ల ఎటువంటి నాగ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ కారణంగా రైతులకు ఎంతో సాయపడే పాము జాతి అంతరించి పోకుండా రక్షించవచ్చు.