Helath Benefits: జామ కాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఎక్కువగా సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు దీనిని పేదవాని యాపిల్ అని కూడా అంటారు.

ఎందుకంటే.. తక్కువ ధరలో ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అంతే కాదు ఏ ప్రాంత రైతులు అయినా దీనిని పండిస్తారు. ఇంటి ఆవరణలో కూడా చాలామంది జామ చెట్లను పెంచుతుంటారు. అందుకే దీనిని పేదవాని యాపిల్ అంటారు. దీనిలో పోషక విలువలు చాలా ఉంటాయని.. ప్రతీ ఒక్కరు దీనిని తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. జామకాయ తినే సమయంలో కొన్ని కాయల్లో గింజలు తక్కువగాను.. మరికొన్ని కాయల్లో గింజలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మనం ముక్కలుగా కోసి వాటిపై కారం, ఉప్పు చల్లుకొని తింటుంటాం. అయితే ఈ గింజలను తినడం మంచిదేనా.. దాని వాల్ల ఏమైనా సైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా.. అనే విషయాలు చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను..
జామకాయ లోపల కొన్ని తెల్లగాను.. మరికొన్ని ఎరుపు రంగులో విత్తనాలు ఉంటాయి. కానీ ఏ కాయలో అయినా గింజలు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబున్నారు. ఈ విత్తనాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా జీర్ణ క్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుందట. అంతే కాదు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు.. రక్తప్రసరణ మంచిగా జరిగి గెండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడతుంది. ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను ఎప్పటికప్పుడు తొలగించి కణాలను రక్షించేందుకు సహాయం చేస్తాయట. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెంపొందేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కూడా ఉపయోగపడుతుందట. అందుకే జామకాయలో అయినా.. పండులో అయినా విత్తనాలను ఎలాంటి డౌట్ లేకుండా తినేయొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.































